టాలీవుడ్ సంచలనం: జనవరి నుంచి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టుపై స్పష్టత వచ్చిందని సినీ వర్గాలు వెల్లడించాయి. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఏఏ23 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్న బన్నీ, డిసెంబర్ నాటికి తన భాగం షూటింగ్ పూర్తి చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే ఆయన ఈ కొత్త చిత్రంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు.