కశ్మీర్ ఉగ్రదాడిలో తండ్రి మరణం: భావోద్వేగానికి గురైన నటి నిమ్రత్ కౌర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఢిల్లీ

తన పదకొండేళ్ల వయసులో కశ్మీర్ ఉగ్రదాడిలో తండ్రి మేజర్ భూపేందర్ సింగ్ను కోల్పోవడం పట్ల బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ, సైనిక వస్త్రాధారణలో వచ్చిన ఉగ్రవాదులు తన తండ్రిని అపహరించి ఏడు రోజుల తర్వాత పొట్టనబెట్టుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. మరణానికి ముందు తన కుటుంబం, ఇద్దరు కుమార్తెల గురించి ఆయన తలచుకున్నారని గుర్తుచేసుకుంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.