నీటి శుద్ధికి నాచుతో తక్కువ ఖర్చుతో కూడిన ఫిల్టర్ రూపకల్పన

రిపోర్టర్: శివ స్థలం: World

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన విద్యార్థిని నిత్యా తమ్మన కేవలం 38 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో నీటిలోని సీసం కాలుష్యాన్ని తొలగించే వినూత్న నాచు ఆధారిత ఫిల్టర్‌ను కనిపెట్టారు. పాత పైపుల ద్వారా తాగునీటిలో కలిసే సీసాన్ని ఇది 95 శాతం వరకు తొలగిస్తుంది. ఈ అద్భుత ఆవిష్కరణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా 'ఇకో-హీరో' గుర్తింపును పొందింది.