రాష్ట్రంలో భారీగా లోటు వర్షపాతం: కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి ముప్పై నాలుగు శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్నినో ముప్పు నేపథ్యంలో సీజన్లో రావాల్సిన వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఇరవై ఒకటో జిల్లాల్లోని మూడు వందల ఎనభై ఎనిమిది మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ప్రత్యేకంగా జీవో జారీ చేసింది.