విజయవాడలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: ప్రధాన సూత్రధారి బషీర్ అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడలో వెలుగుచూసిన భారీ మాదకద్రవ్యాల రాకెట్ వ్యవహారంలో సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి బషీర్ను రైల్వే పోలీస్, ఈగల్ ప్రత్యేక విభాగం సంయుక్త బృందం అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. బెంగళూరు నుంచి నాగ సౌమ్య అనే యువతి ద్వారా విజయవాడకు తరలించిన భారీ ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేతలో బషీర్ పాత్ర కీలకమని తేలింది. కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసి ఈ నెట్వర్క్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.