ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్: పిడుగులతో భారీ వర్షాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అమరావతి, విజయవాడ, తెనాలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.