కూటమి ప్రభుత్వ మోసాలు: హామీల అమలులో విఫలమంటూ కాంగ్రెస్ నిలదీత

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

కూటమి ప్రభుత్వం వృద్ధులు మరియు వితంతువులకు పెన్షన్లు ఇస్తామని ప్రకటించి లక్షలాది మందితో దరఖాస్తులు చేయించుకున్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మువ్వల శ్రీనివాసరావు మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అమలులో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తూ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.