బెంగళూరులో అద్భుతం: చిరుధాన్యాలతో భారీ ఆభరణ రంగవల్లిని ఆవిష్కరించిన ఇంద్రియా
రిపోర్టర్: కిరణ్
స్థలం: Bengaluru
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా బెంగళూరులో భారీ ఆభరణ రంగవల్లిని ఆవిష్కరించినట్లు ఇంద్రియా మార్కెటింగ్ హెడ్ శాంతిస్వరూప్ పాండా తెలిపారు. ఆదిత్య బిర్లా గ్రూప్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇంద్రియా ఆధ్వర్యంలో పద్మిక కలెక్షన్ స్ఫూర్తితో 1600 చదరపు అడుగుల వైశాల్యంలో ఈ కళాఖండాన్ని రూపొందించారు. గిన్నిస్ రికార్డు గ్రహీత శిఖా శర్మ సారథ్యంలో పర్యావరణహిత చిరుధాన్యాలతో దీన్ని తీర్చిదిద్దారు. పండుగ అనంతరం ఈ ధాన్యాన్ని మూగజీవాలకు ఆహారంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.