తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న మాక్ అసెంబ్లీ నిర్వహణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం పాత్ర పోషించగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి పాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 100 రోజుల్లో హామీల అమలు అంటే ఏ వంద రోజులో చెప్పలేదంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెటైర్లు వేశారు.