సివిల్స్ పరీక్షల్లో పేపర్ల వారీగా మార్కులు తెలపాలని సీఐసీ సిఫార్సు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
సివిల్ సర్వీసెస్ పరీక్షలో సిఫార్సు చేసిన అభ్యర్థుల పేపర్ల వారీగా మార్కులను మళ్లీ ప్రచురించాలని కేంద్ర సమాచార కమిషన్ యూపీఎస్సీని కోరింది. 2018 నుండి ఈ విధానాన్ని ఎందుకు నిలిపివేశారో ఎలాంటి అధికారిక రికార్డులను సమర్పించడంలో సిబ్బంది శిక్షణ శాఖ విఫలమైందని సీఐసీ స్పష్టం చేసింది. ఆర్టీఐ దరఖాస్తు విచారణలో భాగంగా ఈ కీలక సిఫార్సు వెలువడింది. దీనివల్ల సివిల్స్ అభ్యర్థులకు పరీక్షా సరళిని అంచనా వేయడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.