ఖమ్మం పర్యటన జ్ఞాపకాలు: పట్టణంలో సజీవ సాక్ష్యంగా గాంధీచౌక్ ప్రాంతం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం పట్టణానికి మహాత్మాగాంధీతో ఉన్న అనుబంధానికి గాంధీచౌక్ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 1946 ఫిబ్రవరి 5న స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గాంధీజీ ఖమ్మంలో పర్యటించారు. విజయవాడ నుంచి రైలులో వచ్చిన ఆయనకు వందలాది మంది స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ సమీపంలో సభలో గాంధీజీ ప్రసంగించారు. ఆయన అడుగుపెట్టిన ప్రాంతం అనంతరం గాంధీచౌక్ గా మారింది. ఆయన జ్ఞాపకంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.