'ప్రజాపాలన దినోత్సవం': తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణ వ్యాప్తంగా గురువారం అధికారికంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ఈ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 'ప్రజాపాలన దినోత్సవం'గా నిర్వహిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ 'తెలంగాణ విమోచన దినోత్సవం'గా జరుపుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.