ఓటీటీకి సిగ్మా చిత్రం: నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా చిత్రం అక్టోబర్ ముప్పైవ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది.