పాలక వర్గాల వైఫల్యాలపై ఉద్యమించాలి

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలక వర్గాలపై బలమైన పోరాటాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని గడ్కోల్లో జరిగిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. యూపీఐ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.