చెల్సియా జట్టుకు టైటిల్ గెలిచే సత్తా లేదు: మాజీ డిఫెండర్ ఆష్లే కోల్

రిపోర్టర్: శివ స్థలం: లండన్

చెల్సియా జట్టు ప్రస్తుత పరిస్థితుల్ లో ఈ ఏడాది టైటిల్ గెలుచుకునే సత్తా లేదని ఆ జట్టు మాజీ డిఫెండర్ ఆష్లే కోల్ స్పష్టం చేశారు. జియోస్టార్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత యజమానుల విధానాలు అర్ధం కావడం లేదన్నారు. క్లబ్ తన పూర్వ వైభవాన్ని, ట్రోఫీలు సాధించే విజేత మానసిక స్థితిని తిరిగి పొందాలని కోరారు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు కావడంతో ప్రదర్శనలో ఒడిదుడుకులు సహజమని కోల్ అభిప్రాయపడ్డారు.