పులివెందులలో హైటెన్షన్: వర్గపోరుతో రణరంగంగా మారిన ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: కడప
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు వైఎస్ఆర్ కడప జిల్లా అధికారులు తెలిపారు. ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాళ్లు, సీసాల దాడి జరిగిందని, ఈ ఘటనలో కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్ లో ఏజెంట్ల వివాదాలు, ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాలతో హైటెన్షన్ వాతావరణం నెలకొందని అధికారులు వెల్లడించారు.