హిందీ రాదన్న కారణంతో కీలక బాధ్యతల నుంచి తొలగించిన వైనం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హిందీ మాట్లాడటం రాదన్న ఏకైక కారణంతో ఉత్తరాదికి చెందిన ఓ కంపెనీలో సీనియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన టెక్కీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్ట్ డెడ్‌లైన్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా తనను మోడల్ ట్రైనింగ్, ఎవాల్యుయేషన్ బాధ్యతల నుంచి మేనేజ్మెంట్ తొలగించిందని ఆయన ఆరోపించారు. కమ్యూనికేషన్ సమస్య ఉందంటూ తనను దక్షిణాది వ్యక్తుల వద్దకు మార్చాలని వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.