శ్రీనగర్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: శ్రీనగర్
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయినట్లు శ్రీనగర్ ఎస్ఎస్పీ జి.వి. సందీప్ చక్రవర్తి వెల్లడించారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారీగా నిషేధిత మందుల బిళ్లలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చండీగఢ్, పంచకుల, అంబాల వరకు ఈ నెట్వర్క్ వేర్లు విస్తరించినట్లు వివరించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.