'ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు': ఓటు పరిరక్షణ వేదిక నేతల ఫైర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: અમరావతి
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించాలని ఓటు పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను సుంకర రాజేంద్రప్రసాద్, ఏబీ వెంకటేశ్వరరావు, బండ్ల శ్రీనివాస్, కేఎస్ లక్ష్మణరావు తదితరుల బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. సాంకేతిక లోపాలతో నోటీసులు జారీ చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు.