స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయం సాధడమే లక్ష్యమన్న మంత్రి నాదెండ్ల మనోహర్
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడమే లక్ష్యంగా జనసేన శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలను క్రమశిక్షణతో పాటిస్తూ, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సముచిత గుర్తింపు లభిస్తుందని ఆయన భరోసా కల్పించారు.