వైఎస్సార్సీపీ నేతల ఆరోపణలపై నారా లోకేష్ కుటిల రాజకీయాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడం కోసం మంత్రి నారా లోకేష్ కుటిల రాజకీయాలకి తెరదీస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడింది. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూ ఈ నెల 21న శాప్ కార్యాలయం ముందు నిరసనకు పిలుపునిచ్చినట్లు వెల్లడించింది. అయితే డీఎస్సీలో సెలెక్ట్ అయిన కొంతమంది అభ్యర్థులను అడ్డుపెట్టుకుని రాజకీయ కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.