రైల్వే ఎన్టీపీసీ సీబీటీ టూ ఆన్సర్ కీ విడుదల

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు కీలక అప్డేట్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీపీసీ అండర్గ్రాడ్యుయేట్ సీఈఎన్ 07/2025కు సంబంధించిన సీబీటీ-2 ఆన్సర్ కీ, ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్ను విడుదల చేసినట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలను పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను సెప్టెంబర్ 30 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.