వైద్య వృత్తిని వీడి బ్రెడ్ షాప్ నడుపుతున్న మహిళా డాక్టర్

రిపోర్టర్: రాము స్థలం: Wuhan

గెనేకాలజిస్టుగా రెండు దశాబ్దాలుగా వైద్య సేవలందించిన డాక్టర్ డాంగ్ మిన్ తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. చైనాలోని వుహాన్ నగరంలో స్టీమ్డ్ బన్ షాప్ ప్రారంభించిన ఆమె, ప్రస్తుతం రెండు అవుట్లెట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య వృత్తిలో ఎదురైన పరిపాలనా పరమైన ఇబ్బందులు, ప్రభుత్వ తనిఖీల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. పది గంటలకు పైగా పనిచేస్తున్నప్పటికీ కొత్త జీవితం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని డాంగ్ మిన్ పేర్కొన్నారు.