వైకాపా బెదిరింపులపై పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: Amaravati

వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే పదింతల ప్రతిస్పందన ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో హింసాత్మక రాజకీయాలను ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని పవన్ స్పష్టం చేశారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు పద్ధతిగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు కూడా వైకాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.