ప్రయాణికులకు తీపి కబురు: దేశంలో నార్తర్న్ కారిడార్ బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రమేష్
స్థలం: Varanasi
దేశంలో సరికొత్త రవాణా విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగా నార్తర్న్ కారిడార్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నుంచి ఆగ్రాకు కేవలం యాభై తొమ్మిది నిమిషాల్లోనే చేరుకోవచ్చని, రాబోయే రోజుల్ లో యువతకు, వ్యాపారులకు మరియు మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.