'మహిళా ఎమ్మెల్యేల గొంతు పిసుకుతారా?': కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఇదొక బ్లాక్ డే అని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, గొంతు పిసికి, చీరలు పట్టుకుని లాగారని ఘాటు ఆరోపణలు చేసింది. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే కాంగ్రెస్ పాలనలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నిలదీస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.