తిరుమల వసతి గదిని ఏఐ ఏజెంట్ ఆస్ట్రా బుక్ చేసిన వైనం
రిపోర్టర్: రమేష్
స్థలం: తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఆస్ట్రా వసతి గదిని బుక్ చేయడానికి ప్రయత్నించినట్లు టెకీ పవన్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీడియో ప్రకారం యూజర్ లాగిన్ వివరాలతో చాట్‌బాట్ వెబ్సైట్లోకి ప్రవేశించి బుకింగ్ ప్రక్రియను చివరి వరకు తీసుకెళ్లింది. అయితే బ్యాంకు వివరాలు అందించకపోవడంతో పేమెంట్ వద్ద నిలిచిపోయిందని వెల్లడించారు. మరోవైపు దర్శన టికెట్ లేకుండా వసతి బుక్ చేయడం కుదరదని తితిదే ఐటీ అధికారి స్పష్టం చేశారు.