మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్: నవంబర్ 1న పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28న జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మైదుకూరు సహా నాలుగు ప్రాంతాల్లో అక్టోబర్ 23, 24 తేదీల్లో నామినేషన్లకు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు.