బ్రిక్స్ కూటమిలో పాకిస్థాన్ సభ్యత్వానికి భారత్ అడ్డంకి!

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాకిస్థాన్ సభ్యత్వ దరఖాస్తు పెండింగ్‌లో పడింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్.. బ్రిక్స్‌లో చేరేందుకు 2023లోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ భారత్ వ్యతిరేకత, వీటో అధికారమే అతిపెద్ద అడ్డంకిగా మారాయి. కొత్త సభ్యుల చేరికకు సర్వసభ్య ఏకాభిప్రాయం తప్పనిసరి కావడంతో పాకిస్థాన్ ప్రయత్నాలు నిలిచిపోయాయి.