అక్రమ కేసులతో వేధింపులు: ప్రభుత్వ తీరును ఎండగట్టిన డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
ఎమ్మెల్యే ఆగడాలను ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (సిర్పూర్) మండిపడ్డారు. బాధితులకు అవార్డు ఇవ్వాల్సింది పోయి కేసులు పెట్టడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ఆరోపించారు. కేటీఆర్ కేసుల విషయంలోనూ రికార్డుల ఆధారంగానే అక్రమంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్న పాలకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.