స్పీకర్‌పై వ్యాఖ్యల దుమారంపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్సీ తాతా మధు.
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టతనిచ్చారు. స్పీకర్ పదవికి తాను పూర్తి గౌరవం ఇస్తానని, పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలోనే ఆ మాటలొచ్చాయని వివరించారు. శాసనసభలో తనపై దాడి జరిగిందని, షర్టు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.