ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కథా చర్చలు పూర్తి
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఎన్టీఆర్‌తో త్వరలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయినట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెల్లడించారు. వెంకటేష్‌తో రూపొందించిన ఆదర్శ కుటుంబం ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ టైటిల్ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమా పూర్తి కాగానే ఈ భారీ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.