వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకుల వీఆర్ఏ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు శనివారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16 నుంచి తలపెట్టిన సమ్మె నోటీసును అధికారులకు సమర్పించారు. తెలంగాణ తరహాలో పే-స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూగుంట ప్రకాష్, జూగుంట చెన్నయ్య, డి. రాధమ్మ, వి. మేఘన, ఎం. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.