మాజీ ఉపముఖ్యమంత్రి హఠాన్మరణంతో కన్నీటికడలైన బొబ్బిలి రాజకోట
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు బేబీనాయన బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004 నుండి బొబ్బిలి రాజకుటుంబంతో ఆళ్ల నానికి మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. వారి అకాల మరణం నియోజకవర్గానికి అలాగే రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.