జాతీయ సదస్సును విజయవంతం చేయాలి: ఎంఎస్పీ ప్రతినిధి ప్రణయ్దీప్ మాదిగ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
అక్టోబర్ 6న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి కళ్లెపెళ్లి ప్రణయ్దీప్ మాదిగ పిలుపునిచ్చారు. నర్సంపేట ఎస్సీ బాలుర వసతిగృహంలో విద్యార్థులతో కలిసి సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ బలమైన విద్యార్థి ఉద్యమంగా ఎదిగిందని ఆయన స్పష్టం చేశారు.