'లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికారు': కీసరలో ఏసీబీ అధికారుల సంచలన దాడులు
రిపోర్టర్: మహేష్
స్థలం: మేడ్చల్-మల్కాజిగిరి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌లో బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసిన సీఐ ఆంజనేయులు, రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిలను ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు అరెస్ట్ చేశారు. బాధితుడిని తీవ్రంగా వేధిస్తూ లంచం వసూలు చేస్తున్న ఈ ఘటనపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.