ప్రధాని మోదీ నాయకత్వంలోనే వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ: బీజేపీ తెలంగాణ
రిపోర్టర్: సతీష్
స్థలం: Telangana
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోందని బీజేపీ తెలంగాణ స్పష్టం చేసింది. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలు తమ తీర్పునిస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఉపఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంపై కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమి అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజా మద్దతుతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని బీజేపీ తెలంగాణ పేర్కొన్నారు.