కేసీఆర్ ఫాంహౌస్ శుద్ధి కేసులో ఏడుగురు BRS నేతల అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వివాదంలో ఏడుగురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో తలదాచుకున్న నిందితులను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్ కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను సిద్దిపేట జైలుకు తరలించారు.