భూముల రీసర్వే పనుల పరిశీలన: కుభీర్ లో సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సౌన గ్రామంలో భూముల రీసర్వే ప్రక్రియను భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పనులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.