పులివెందులలో ఎన్నికల అక్రమాలపై రిటర్నింగ్ ఆఫీస్ ఎదుట జగన్ బైఠాయింపు

రిపోర్టర్: గోపి స్థలం: పులివెందుల

పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, దొంగ ఓట్లు వేయడంపై అధికారులను ఆయన తీవ్రంగా నిలదీశారు. బిహార్ ను తలపించేలా ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తక్షణమే రీ పోలింగ్ నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు.