చిన్న పత్రికల పరిరక్షణకు జాతీయ సదస్సు: ప్రచురణకర్తల సమష్టి కృషి

రిపోర్టర్: VG ReddyD SrJournalist స్థలం: నెల్లూరు అర్బన్

డెహ్రాడూన్లో ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పాత్రికేయులు హాజరయ్యారు. చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న ఆర్థిక, ప్రచురణ సంబంధిత సమస్యలపై చర్చించారు. జాతీయ అధ్యక్షుడు గురిందర్ సింగ్ ప్రసంగించగా, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ప్రతినిధి యోగేష్ కుమార్ భవేజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.