వైకాపా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మెగా డీఎస్సీ క్రీడాకోటా ఉపాధ్యాయులు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

మెగా డీఎస్సీ-2025 క్రీడా కోటాపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తీవ్రంగా తిప్పికొట్టారు. ఫేక్ సర్టిఫికెట్లంటూ ఆరోపించే ముందు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తమ కష్టాన్ని, ప్రతిభను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమని, రాజకీయ విమర్శల కోసం క్రీడాకారుల త్యాగాలను వాడుకోవడం సరికాదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.