పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులతో ముందుకు సాగిన యువత

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండగను పురస్కరించుకుని పదిహేను వందల మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు షేక్ ఇల్తామాష్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుందని, చెరువులను, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్, సాయి, నాగేశ్వరరావు, శరత్ తదితర సభ్యులు పాల్గొన్నారు.