బాపట్లలో షీట్ హోల్డర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

రిపోర్టర్: కృష్ణ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు షీట్ హోల్డర్స్ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నేరాల నియంత్రణలో భాగంగా అనుమానితులు మరియు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితం గడపాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.