మహిళలకు చాకలి ఐలమ్మ పోరాటమే నిజమైన స్ఫూర్తిదాయకం

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె పోరాటమే స్ఫూర్తి అన్నారు. మహిళలందరూ ఏకమై బెల్ట్ షాపులను తరిమేయాలని పిలుపునిచ్చారు. డిండి ప్రాజెక్టు ద్వారా మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.