ముస్లింల హక్కుల పరిరక్షణే లక్ష్యం: ఖమ్మంలో తంజిమ్-ఎ-ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి పిలుపు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని తంజిమ్-ఎ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మహమ్మద్ సలాం పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, ఇళ్ల స్థలాలు, వక్ఫ్ భూములు, మసీదులు మరియు కబరస్తాన్ల రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో డిమాండ్ చేశారు.