మధ్యప్రదేశ్లో దారుణం: మహిళ హత్య, తీవ్రంగా గాయపడిన కూతురు
రిపోర్టర్: రాము
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సత్వస్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో 55 ఏళ్ల మహిళ హత్యకు గురికాగా, ఆమె కూతురు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మడుగులో ఉన్న బట్టలతో చిన్నారి బయటికి వచ్చి ఏడవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.