'మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి': వారణాసిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

రిపోర్టర్: హరి స్థలం: వారణాసి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం మరియు ఆయన రాజకీయ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారణాసిని సందర్శించారు. కాశీ విశ్వనాథుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారణాసిలో ప్రారంభమైన 'వడ్నగర్ సేవా యాత్ర'లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని, ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు.