రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారణకు ప్రత్యేక బెస్ ప్రాజెక్టులు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో పీక్ డిమాండ్ సమయంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్టుల ద్వారా ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. దీనికోసం వెయ్యి ఐదు వందల మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించి వినియోగదారులపై ట్రూఅప్ భారం పడకుండా తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.