షాకింగ్ ఘటన: పాఠశాలలో విద్యార్థిపై రంపం దాడి కేసులో హెచ్ఎం సస్పెండ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిపై యువకుడు రంపంతో దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. స్కూల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని పేర్కొంటూ హెచ్ఎం రాజేశ్వరిని సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. బాధితురాలికి బెంగళూరు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.